English | Telugu

పవన్ కళ్యాణ్ తప్పించుకున్నాడు.. చిరంజీవి బుక్కయ్యాడు!

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన గత చిత్రం 'భోళా శంకర్'. తమిళ సినిమా 'వేదాళం'కు రీమేక్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంట‌ర్‌టైన్మెంట్స్ నిర్మించింది. 2023 ఆగస్టులో విడుదలైన ఈ చిత్రం పరాజయం పాలైంది. నిజానికి ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేయాల్సి ఉండగా.. అనుకోకుండా చిరంజీవి చేసి ఫ్లాప్ ని ఖాతాలో వేసుకున్నారు.

జూన్ 12న 'హరి హర వీరమల్లు'తో ప్రేక్షకులను పలకరించనున్నారు పవన్ కళ్యాణ్. తాజాగా వీరమల్లు మూడో గీతం 'అసుర హననం' ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో నిర్మాత ఎ.ఎం. రత్నం మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారితో తమిళ సూపర్ హిట్ మూవీ 'వేదాళం'ని రీమేక్ చేద్దామనుకున్నామని.. కానీ ఎన్నికల వల్ల చేయలేకపోయామని చెప్పారు.

వేదాళం మూవీ 2015 లో విడుదలైంది. ఎ.ఎం. రత్నం మాటలను బట్టి చూస్తే.. 2019 ఎన్నికలకు ముందు పవన్ తో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు కానీ కుదరలేదు. ఆ తర్వాత ఇదే సినిమాని 'భోళా శంకర్'గా రీమేక్ చేశారు చిరంజీవి. తమిళ్ లో విడుదలైన ఎనిమిదేళ్ళకు తెలుగులో రీమేక్ అయిన ఈ సినిమా నిరాశపరిచింది.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.