English | Telugu

ఆదిపురుష్ దర్శకుడితో అబ్దుల్ కలాం బయోపిక్.. హీరో ఎవరో తెలుసా..?

గత కొన్నేళ్లుగా ఎన్నో బయోపిక్ లు ప్రేక్షకులను పలకరించాయి. వాటిలో పలు చిత్రాలు ప్రేక్షకుల మెప్పు కూడా పొందాయి. ఇప్పుడు భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం బయోపిక్ కి ముహూర్తం కుదిరింది. (APJ Abdul Kalam)

విభిన్న చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush).. ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను ప్రతిష్ఠాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ ఆవిష్కరించారు. ఈ చిత్రానికి 'కలాం' (KALAM) అనే టైటిల్‌ ఫిక్స్ చేశారు. 'ది మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా' అనేది ట్యాగ్‌లైన్. ఈ బయోపిక్ ని 'తానాజీ’, ‘ఆదిపురుష్’ చిత్రాల దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్నాడు.

ఈ ప్రాజెక్ట్‌ను అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, టీ-సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, గుల్షన్ కుమార్, తేజ్ నారాయణ్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అబ్దుల్ కలాం జీవితం, భారత అంతరిక్ష, రక్షణ కార్యక్రమాలకు ఆయన చేసిన అమూల్యమైన సేవను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.