English | Telugu

నోరు జారినందుకు...కుష్బూపై హిజ్రాల కేసు..!

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ ప్రచార కార్యదర్శి కుష్బూపై మధురై కోర్టులో కేసు నమోదైంది. తమిళనాడు ఎన్నికల సందర్భంగా హిజ్రాలనుద్దేశించి ఏప్రిల్ 2వ తేదిన ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుష్బూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిజ్రాలు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశపడటం సమంజసం కాదని, తమకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా?లేదా? అనే విషయంపై వారు ఆలోచించుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలపై హిజ్రాలు మండిపడ్డారు. చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. దాంతోపాటు మధురై వడంపోక్కి వీధికి చెందిన భారతి కన్నమ్మ అనే హిజ్రా మధురై సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తోంది. హిజ్రాల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారంటూ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. హిజ్రాలకు తగిన రాయితీలు, హక్కులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని పిటిషన్‌లో పేర్కొంది. ఈ విషయాన్ని కుష్బూ తెలుసుకుంటే మంచిదని కన్నమ్మ సూచించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.