English | Telugu

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్‌కు తీవ్ర అస్వస్థత

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి ఛాతీనొప్పికి గురికావడంతో ఆయన్ను కుటుంబసభ్యులు ముంబైలోని లీలావతి ఆస్పత్రికి చేర్పించారు. దిలీప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆయన న్యూమోనియాతో బాధపడుతున్నారు. భారతీయ సినిమాలో విషాదచిత్రాల హీరోగా దిలీప్‌కు పేరుంది. ఆయనకు 1994లో ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.