English | Telugu

జర్నలిస్ట్ కి తన సత్తా చాటి చెప్పిన కిరణ్ అబ్బవరం.. తోడేలు కాబట్టే పాన్ ఇండియా

సాధారణంగా జర్నలిస్ట్ ల నుంచి హీరోలకి స్మూత్ గా కౌంటర్లు వస్తుంటాయి. దాంతో రెండు చేతులు ఫాంట్ జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళవలసిన పరిస్థితి హీరోలకి వస్తుంటుంది. కానీ ఇప్పుడు రివర్స్ లో ఒక సినీ జర్నలిస్ట్ తన రెండు చేతులు ఫాంట్ జేబులో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి.

కిరణ్ అబ్బవరం(kiran abbavaram)హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటు వెళ్తున్నాడు. నిజానికి హిట్ తన తలుపు తట్టి చాలా కాలమే అవుతుంది. అయినా సరే మంచి రోజులు రాకపోతాయా అని పట్టువదలని విక్రమార్కుడులా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటు ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలోనే క(ka)మూవీ చేస్తున్నాడు. ఒకే ఒక అక్షరంతో కూడిన భిన్నమైన మూవీ కావడంతో అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పైగా కిరణ్ తన కెరీర్ లోనే చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ మూవీ. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చిత్ర విశేషాలని పంచుకున్నారు. ఈ నేపధ్యంలో కిరణ్ తో ఒక జర్నలిస్ట్ మాట్లాడుతు ఇప్పుడొస్తున్న చాలా మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చెయ్యటం లేదు. అసలు మీకు తెలుగులోనే చాలా సంవత్సరాల నుంచి హిట్ కూడా లేదు. అలాంటిది పాన్ ఇండియా రేంజ్లో క ని ఎలా విడుదల చేస్తారని అడిగాడు. దీనికి కిరణ్ సూపర్ గా సమాధానం ఇచ్చాడు.

పాన్ ఇండియా రేంజ్ అనేది కంటెంట్ ని బట్టి ఉంటుంది.ప్రెజంట్ నా స్థాయి ఏంటనేది నథింగ్. కేవలం కంటెంట్ మాత్రమే ముఖ్యం. మంజుమ్మేల్ బాయ్స్(manujummel boys)లో హీరో ఎవరని హిట్ చేసారు. అలాగే కాంతారా(kantara)లో హీరో ఎవరని హిట్. వాటిల్లో కంటెంట్ నే హీరో. అందుకే నా స్థాయి ఏంటనేది అనవసరం. క లో కంటెంట్ ఉంది కాబట్టే పాన్ ఇండియా లెవల్ కి వెళ్తున్నాం అని చెప్పుకొచ్చాడు. సుజిత్(sujith) అండ్ సందీప్(sandeep)అనే ఇద్దరు దర్శకులు దర్శకత్వం వహిస్తున్నారు. చింత గోపాల కృష్ణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. టీజర్ అయితే చాలా బాగుంది. క మీద ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. ఒక కరుడు గట్టిన హంతకుడు తను ఎక్కడ నుంచి వచ్చాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కథ ఉంది. చివర్లో కిరణ్ ని తోడేలు అని సంబోధించడంతో డిఫరెంట్ కథ అని అర్ధం అవుతుంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.