English | Telugu
డైరెక్టర్ బాబీ విడుదల చేసిన ‘రేవు’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Updated : Jul 15, 2024
వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘రేవు’. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్‌పై నిర్మాత డా.మురళీ గింజుపల్లి, నవీన్ పారుపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణ సూపర్ విజన్ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ పర్వతనేని రాంబాబు వ్యవహరిస్తున్నారు. హరినాథ్ పులి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘రేవు’ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ - ‘రేవు’సినిమా ఫస్ట్ లుక్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. సినిమా ప్రమోషన్‌లో జర్నలిస్ట్‌లు ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. ప్రభుగారు నాకు చాలా కాలంగా పరిచయం. డైరెక్టర్‌గా నన్ను ముందు నుంచీ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే పర్వతనేని రాంబాబుగారు కూడా మంచి మిత్రులు. వీరిద్దరు మరో మిత్రుడు మురళీ గింజుపల్లిగారితో కలిసి ‘రేవు’ సినిమా చేస్తున్నారు. నేను ఈ సినిమా విజువల్స్ చూశాను. చాలా బాగున్నాయి. టీమ్‌లోని ప్రతి ఒక్కరికి ‘రేవు’ సినిమా మంచి పేరు తీసుకురావాలి. అలాగే నిర్మాతకు డబ్బులు తీసుకుని రావాలని కోరుకుంటున్నా’ అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. ‘రేవు’ సినిమాను యంగ్ టీమ్ అంతా కలిసి ప్యాషనేట్ గా రూపొందించారు. ఈ మూవీ కంటెంట్ చూశాకా చాలా ఇంప్రెస్ అయ్యాను. నా మిత్రుడు పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా డా. మురళీ గింజుపల్లిగారి నిర్మాణంలో ‘రేవు’ సినిమాను మీ ముందుకు తీసుకు వస్తుండటం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ సూపర్ విజన్ చేశాను. సినీ జర్నలిస్ట్‌గా మాకున్న అనుభవంతో ఒక మంచి ప్రాడక్ట్ మీ ముందుకు వచ్చేలా ప్రయత్నిస్తున్నాను. మా ‘రేవు’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి అంగీకరించిన డైరెక్టర్ బాబీగారికి థాంక్స్ చెబుతున్నా. ఆయన ఎన్‌బీకే 109 సినిమా భారీ షెడ్యూల్ కోసం ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు’ అన్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ - మా ‘‘రేవు’’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ బాబీగారికి థాంక్స్. ‘రేవు’ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎంటర్‌టైన్‌మెంట్ ఎమోషనల్ కలిసి మంచి కథతో మీ ముందుకు రాబోతోంది. ఆగస్టు రెండో వారంలో ‘రేవు’ సినిమాను ఘనంగా మీ అందరి ముందుకు థియేట్రికల్ రిలీజ్ ద్వారా తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.
దర్శకుడు హరినాథ్ పులి మాట్లాడుతూ.. ‘రేవు చిత్రాన్ని ఇంతవరకు తీసుకువచ్చిన నిర్మాణ పర్యవేక్షణ జర్నలిస్ట్ ప్రభు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత పర్వతనేని రాంబాబు, నిర్మాతలకు మా చిత్ర బృందానికి నాకు అన్ని విధాలా సహకరించినందుకు కృతజ్ఞతలు’ అన్నారు.