English | Telugu

సరైనోడు బెనిఫిట్ షోలు క్యాన్సిల్..!

సర్దార్ గబ్బర్ సింగ్ రికార్డ్ బెనిఫిట్ షోలు వేస్తే, సరైనోడు టీం కూడా అదే సూత్రాన్ని ఫాలో అయి, బెనిఫిట్ షోలను ఉపయోగించుకోవాలనుకంది. కానీ ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ లో బ్రమరాంభ, అర్జున్, కోణార్క్, హైటెక్ థియేటర్లలో సరైనోడు బెనిఫిట్ షో లు వేయాలనుకున్నారు. కానీ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాత్రం ఈ షోస్ కు పర్మిషన్స్ లేవని చెబుతున్నారు. అంతే కాక, ఇకపై ఏ సినిమాకూ, సిటీలో బెనిఫిట్ షో లు అనుమతించే ప్రస్తక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పడే ఉదయం 8.45 షో హైదరాబాద్ లో అల్లు ఫ్యాన్స్ కు మొదటి షో కాబోతోంది. మరో పక్క బన్నీ, బెంగళూరులో తన సినిమా ప్రమోషన్ల జోరు పెంచాడు. బన్నీ కెరీర్లోనే, బిగ్గెస్ట్ రిలీజ్ గా సరైనోడు రికార్డ్ సృష్టించబోతోంది. బోయపాటి బన్నీ కాంబినేషన్ కావడంతో మొదటినుంచీ భారీ అంచనాలతో ఉన్న సరైనోడు, అభిమానుల అంచనాలు అందుకుంటుందో లేదో రేపు తేలిపోనుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.