English | Telugu
రిలయన్స్ హాస్పిటల్ లో కియారా డెలివరీ
Updated : Jul 16, 2025
సూపర్ స్టార్ 'మహేష్ బాబు'(Mahesh Babu),'కొరటాల శివ'(Koratala Siva)కాంబోలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం ద్వారా తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన బాలీవుడ్ హీరోయిన్ కియారా అడ్వాణీ. ఆ తర్వాత 'రామ్ చరణ్'(Ram Charan)తో వినయవిధేయరామ, గేమ్ చేంజర్ వంటి పలు చిత్రాల్లో నటించి మెప్పించిన కియారాకి 2023 లో ప్రముఖ హీరో 'సిద్దార్ధ్ మల్హోత్రా' తో ఫిబ్రవరి 7 న వివాహం జరిగింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 28 న తాము తల్లితండ్రులు కాబోతున్నట్టుగా కియారా, సిద్దార్ద్ లు ప్రకటించారు. ఈ మేరకు రీసెంట్ గా కియారా ఆడబిడ్డని ప్రసవించింది. ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్లో ప్రసవం జరగగా తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని ఇరువురి కుటుంబసభ్యులు తెలిపారు.
2014 లో ఫగ్లీ అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన కియారా ఆ తర్వాత అనేక చిత్రాల్లో విభిన్న రకాల పాత్రలని పోషించి తన నటనతో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. ఆగష్టు 14 న విడుదల కాబోతున్న 'హృతిక్ రోషన్'(Hrithik Roshan)'ఎన్టీఆర్'(Ntr)ల ''వార్ 2'(War 2)లో ప్రధాన పాత్ర పోషించింది.