English | Telugu
కీరవాణి, రాజమౌళి ఇంట్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి
Updated : Jul 7, 2025
ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani)సినీ ప్రస్థానం గురించి అందరకి తెలిసిందే. సుదీర్ఘ కాలం నుంచి సాగుతున్న తన సినీ జర్నీ లో ఎన్నో అద్భుతమైన పాటలు వచ్చాయి.ఈ రోజు తెల్లవారుజామునహైదరాబాద్ లో కీరవాణి తండ్రి శివ శక్తీ దత్తా(Siva Shakthi Datta)మరణించడం జరిగింది.
తొంబై రెండేళ్ల వయసు కలిగిన శివ శక్తీ దత్తా 'చంద్ర హాస్' అనే సినిమాకి దర్శకత్వం వహించాడు. తన సోదరుడు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తనయుడు ఎస్ ఎస్ రాజమౌళి(ss Rajamouli)దర్శకత్వంలో వచ్చిన సై, ఛత్రపతి, బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో కొన్ని సాంగ్స్ రాసారు. విజయేంద్రప్రసాద్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో వచ్చిన 'రాజన్న' మూవీతో పాటు రీసెంట్ గా వచ్చి ఘన విజయాన్ని అందుకున్న హనుమాన్ మూవీలో కూడా సాంగ్స్ రాసారు. కధా రచయితగాను పలు సినిమాలకి పని చేసాడు.
శివశక్తి దత్తా మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేసారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు స్వస్థలం.