English | Telugu
బాలీవుడ్‌లో బన్నీ స్టెప్పులేస్తాడా?
Updated : Mar 9, 2015
టాలీవుడ్‌లో బెస్ట్ డాన్సర్ ఎవరేంటే అల్లు అర్జున్ పేరు చెప్పాల్సిందే. టాలీవుడ్ అనేంటి?? దక్షిణాదిలోనే బన్నీ సూపర్ డాన్సర్. బన్నీ స్టెప్పులకు మల్లూవుడ్ కూడా ఫిదా అయిపోయింది. ఇప్పుడు బన్నీ టాలెంట్ బాలీవుడ్‌కీ తెలియబోతోంది. ఎందుకంటే త్వరలోనే ఈ అల్లువారి పిల్లడు బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న బాలీవుడ్ చిత్రం ఏబీసీడీ 2. ఈ చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. అందులో బాలీవుడ్ స్టార్లంతా స్టెప్పులు వేయబోతున్నారట. ఆ పాటలో బన్నీ కూడా కనిపిస్తాడని టాక్. బన్నీకి ప్రభుదేవాకి మంచి అనుబంధం ఉంది. ప్రభుదేవా డాన్సులంటే బన్నీకి చాలా ఇష్టం. బన్నీ స్టైల్ అన్నా ప్రభుకి ఇష్టమే. ఈ అనుబంధంతోనే బన్నీ ఏబీసీడీలో కనిపించడానికి ఒప్పుకొన్నాడట. ఓ పాటలో బాలీవుడ్ స్టార్లతో పాటు బన్నీ కూడా తళుక్కున మెరుస్తాడట. మొత్తానికి బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైందన్నమాట. మరి తన స్టెప్పులతో , స్టైల్స్‌తో అక్కడ ఇంకెంతమంది అభిమానుల్ని సంపాదించుకొంటాడో చూడాలి.