English | Telugu

బండ జ్యోతి- తను బాధపడుతూ మనల్ని నవ్వించింది

జన్యువులే కారణమో, జీవనశైలే కారణమో... తను చాలా లావుగా ఉండేది. ఊబకాయం వల్ల శారీరికంగా చాలా ఇబ్బంది పడేది. కానీ అదే ఆసరాగా చేసుకుని ప్రేక్షకులని తెగ నవ్వించింది... ఆమే హాస్య నటి జ్యోతి! లెక్కకు మిక్కిలిగా సినిమాలలో, సీరియళ్లలో తన హావభావాలతో వీక్షకులకు చేరువైంది. జ్యోతి పట్నాయక్‌ కాస్తా బండ జ్యోతిగా పేరుపొందింది. సుదీర్ఘకాలంగా పక్షవాతంతో బాధపడుతున్న తన తల్లిన చూసుకుంటూనే ఆమె నానక్‌రాం గూడలోని చిత్రపురి కాలనీలో, తన అపార్టుమెంటులో తుదిశ్వాసను విడిచారు. తల్లిని కంటికి రెప్పలా చూసుకునేందుకు, జీవనాన్ని ముందుకు సాగించేందుకు ఆమె చిన్నా పెద్దా వేషాలెన్నింటినో వేశారు.

అవకాశం వస్తే డబ్బింగ్‌ కూడా చెప్పేవారు. స్వయంవరం, భద్రాచలం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి వంటి సినిమాలలో జ్యోతి నటనకు ప్రశంసలు లభించాయి. రజనీకాంత్‌ నటించిన అరుణాచలం సినిమాలోనూ ఒక చిన్న పాత్రను పోషించి మెప్పించారు. ఇక టీవీ ధారావాహికలతోనూ తెలుగు ప్రేక్షకులకు ఆమె పరిచయమే. అలనాటి భాగవతం సీరియల్‌ మొదలుకొని ఇంకా ప్రసారం అవుతున్న అమ్మనాకోడలా వరకూ ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగింటి ఆడపడుచులకు దగ్గరయ్యారు. వేసినవి చిన్నాచితకా పాత్రలే అయినా, వాటి నిడివి ఎంత తక్కువగా ఉన్నా... కాస్త పరిధిలోనే తనదైన శైలిలో, హావభావాలతో మెప్పించారు జ్యోతి.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.