English | Telugu
కన్నప్ప ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారు
Updated : Jun 10, 2025
మంచు విష్ణు(Manchu Vishnu)మోహన్ బాబు(Mohan Babu)ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన చిత్రం కన్నప్ప(Kannappa). ప్రభాస్(Prabhas),మోహన్ లాల్,(Mohan Lal)అక్షయ్ కుమార్(Akshay KUmar)వంటి అగ్ర నటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కాబోతున్న కన్నప్ప ఈ నెల 27 న రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో వేగాన్ని పెంచింది. అందులో భాగంగా రీసెంట్ గా గుంటూరు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా, మరికొన్ని ఏరియాల్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని జరపడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.
ఇక ఈ మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు ఎప్పట్నుంచో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా విష్ణు 'ఎక్స్'(X)వేదికగా జూన్ 13 న ట్రైలర్ రిలీజ్ చేస్తునట్టుగా ప్రకటించాడు. కాకపోతే డేట్ ని ప్రకటించలేదు. మరి ఆ రోజు ఉదయం టైమ్ ని వెల్లడి చేస్తాడేమో చూడాలి. ఏది ఏమైనా 13 న ట్రైలర్ రిలీజ్ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ట్రైలర్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ మొదలయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో అయితే ట్రైలర్ లో ప్రభాస్ ని ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఏర్పడింది. ఎందుకంటే కన్నప్ప లో ప్రభాస్ ని ప్రకటించినప్పటి దగ్గర్నుంచి ప్రభాస్ క్యారక్టర్ కి సంబంధించిన ఒక పోస్టర్ ని మాత్రమే వదిలారు. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే చిన్నప్పటి టెన్షన్ కూడా అభిమానుల్లో మొదలయిందని చెప్పవచ్చు.
విష్ణు సరసన ప్రీతిముకుందన్ హీరోయిన్ గా చేస్తుండగా మోహన్ బాబు, శరత్ కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహా భారతం ఫేమ్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకుడుగా వ్యవహరిస్తున్న కన్నప్ప మూవీ పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది.