English | Telugu

షాకింగ్: కంగనాకు హృతిక్ సపోర్ట్..!

గత కొద్ది రోజులుగా హృతిక్ కంగనా ల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. రీసెంట్ గా కంగనా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కంగనా గురించి కొన్ని విషయాలు వెల్లడించాడు. ఆమె బ్లాక్ మ్యాజిక్ ప్రాక్టీస్ చేస్తుందని, సోషియో పాత్ అని అతను చేసిన వ్యాఖ్యలు చాలా మందికి రిజిస్టర్ అయిపోయాయి. అవి నిజమో అబద్ధమో ఎవరికీ తెలియకపోయినా, హృతిక్ అభిమానులు మాత్రం అవన్నీ నిజమేనని, అందుకే తమ హీరోను ఆమె వేధిస్తోందని ఫిక్సైపోయారు. తాజాగా ఆమెకు క్యారెక్టర్ లేదంటూ, క్యారెక్టర్ లెస్ కంగనా అన్న హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. చాలామంది ఈ ట్యాగ్ తోనే కంగనాను ఆడిపోసుకుంటున్నారు. ఆమెతో విభేదాలున్నప్పటికీ, హృతిక్ మాత్రం ఈ ట్యాగ్ ను విమర్శించాడు. ఇది చాలా తప్పని, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని క్యారెక్టర్ లెస్ గా జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదని ట్వీట్ చేశాడు హృతిక్.

కోపాన్ని దిగమింగి, ప్రేమనే పంచాలని ట్వీటాడు హృతిక్. ఆమెతో గొడవలున్నా, వెనకేసుకుని వచ్చిన హృతిక్ వ్యక్తిత్వాన్ని అభిమానులు హర్షిస్తున్నారు. మరో వైపు కంగన అభిమానులు మాత్రం, ఒక అమ్మాయి గురించి ఇలాంటి ట్యాగ్ ను స్టార్ట్ చేసిన వాళ్లు మనుషులే కాదంటూ విమర్శిస్తున్నారు. ఇద్దరి మధ్యా ఉండాల్సిన వివాదం, మీడియా తలుపుల ద్వారా పబ్లిక్ లోకి వచ్చేసింది. ఇప్పుడు అభిమానుల మధ్య వార్ గా మారింది. ఈ విభేదాలకి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.