English | Telugu

బ్రహ్మోత్సవం సాంగ్ టీజర్ రివ్యూ..!

చాలా కాలంగా మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్రహ్మోత్సవం పండగ మొదలైంది. నిన్న బ్రహ్మోత్సవం సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసిన మూవీ టీం, మే 7న ఆడియో ఫంక్షన్ నిర్వహించనుంది. సాంగ్ టీజర్ లో మహేష్ లుక్ కు, మ్యూజిక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. మహేష్ పెయింటింగ్ వేస్తుండగా టీజర్ స్టార్ట్ అవుతుంది. ముందు రిలీజ్ చేసిన టీజర్ లో ఉన్న బిట్ ఇది. వైట్ అండ్ వైట్ లో మహేష్ నడుస్తూ వెళ్తుండగా, పక్కన అమ్మాయిలు చూస్తూ నిల్చునే షాట్, చిన్న పాప మహేష్ కు ఎదురొచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గానే, మహేష్ ఆమె బుగ్గ మీద చిటికె వేసి కిందకు వెళ్లిపోయే షాట్ దగ్గర టైటిల్ పడుతుంది. ఫినిషింగ్ టచ్ గా మహేష్ హాయిగా ఊయల్లో రిలాక్స్ అవుతుతున్న షాట్ తో టీజర్ ను ఎండ్ చేశాడు డైరెక్టర్. మొత్తం టీజర్ కు బ్యాగ్రౌండ్ లో మధురం మధురం అంటూ మెలోడీ సాంగ్ ప్లే అవుతూ సినిమాపై మంచి ఫీల్ ను తీసుకొస్తుంటుంది. మొత్తమ్మీద ఈ సమ్మర్లో మిస్ అయిన ఫ్యామిలీ సినిమా లోటును బ్రహ్మోత్సవం తీర్చేలాగే కనిపిస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.