English | Telugu

ఆఫ్గన్ తీవ్రవాదిగా కమల్ "విశ్వరూపం"

ఆఫ్గన్ తీవ్రవాదిగా కమల్ హాసన్ నటిస్తున్నారని తెలిసింది. వివరాల్లోకి వెళితే భారతదేశం గర్వించతగ్గ సకలకళావల్లభుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం "విశ్వరూపం". ఈ "విశ్వరూపం" చిత్రం షూటింగ్ 25 రోజుల పాటు జోర్డాన్ లో జరిగింది. ఇప్పటికి కనీసమ యాభైశాతం సినిమా కూడా పూర్తికాకుండానే ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికి 52 కోట్లయిందని సమాచారం. ఇంకా ఈ "విశ్వరూపం" చిత్రం యు.యస్. షెడ్యూలు డిసెంబర్ 16 నుండి రెండవ స్కెడ్యూల్ ప్రారంభం కానుంది.

75 మంది యూనిట్ మెంబర్లతో యు.యస్.లో మిగిలిన 60 శాతం సినిమాని అక్కడే పూర్తిచేయనున్నారట కమల్ హాసన్. ఈ "విశ్వరూపం" చిత్రం పూర్తయ్యేసరికి 100 కోట్ల బడ్జెట్ దాటే అవకాశముందని తమిళ సినీ పరిశ్రమ అంటోంది. ఈ "విశ్వరూపం" చిత్రంలో కమల్ హాసన్ ఒక ఆఫ్గనిస్తాన్ తీవ్రవాదిగా నటిస్తున్నారట.దీన్ని తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తారట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.