English | Telugu

అల్లు అర్జున్ కొత్త సినిమా "హనీ"

అల్లు అర్జున్ కొత్త సినిమా "హనీ" అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రానికి ఈ "హనీ" పేరుని పరిశీలిస్తున్నారట. అలాగే "హి ఈజ్ వెరీ స్వీట్" అన్న క్యాప్షన్ ని కూడా పరిశీలిస్తున్నారని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఇదింకా అఫీషియల్ గా ప్రకటించ బడలేదు. దీనికన్నా ముందు తన మాతృసంస్థ గీతా ఆర్ట్స్ లో వినాయక్ దర్శకత్వంలో, అల్లు అర్జున్ హీరోగా నటించిన "బద్రీనాథ్" చిత్రం ఫ్లాపయ్యింది.

అలాగే మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన "ఖలేజా" కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దర్శకుడూ, హీరోల గత చిత్రాలు కూడా ఫ్లాపవటంతో ఈ "హనీ" చిత్రం మీద ఇద్దరూ చాలా ఆశలు పెట్టుకున్నారట. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయటానికి ఇద్దరూ బాగా కష్టపడుతున్నారని సమాచారం. ప్రతి చిత్రానికీ యేడాది సమయం తీసుకునే త్రివిక్రమ్ ఈ "హనీ" చిత్రాన్ని లేవలం 90 రోజుల్లోనే పూర్తిచేయనున్నారట. ఈ "హనీ" చిత్రం రానున్న వేసవి శలవులకు విడుదలవుతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.