English | Telugu

డబ్బింగ్ లో రామ్ "ఎందుకంటే....ప్రేమంట"

డబ్బింగ్ లో రామ్ "ఎందుకంటే....ప్రేమంట" ఉందని తెలిసింది. వివరాల్లోకి వెళితే "తొలిప్రేమ" ఫేం కరుణాకరన్ దర్శకత్వంలో, చురుకైన యువ హీరో రామ్ హీరోగా అందాల మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నిర్మిస్తున్న చిత్రం "ఎందుకంటే....ప్రేమంట" . ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మేనల్లుడు జి.వి.ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ "ఎందుకంటే....ప్రేమంట" చిత్రం షూటింగ్ ఫ్రాన్స్, స్విట్జర్ల్యాండ్, హైదరాబాద్ లలో షూటింగ్ జరుపుకుంది.

ఈ "ఎందుకంటే....ప్రేమంట" చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. ఈ చిత్రం హీరో రామ్ ప్రస్తుతం తన పాత్రకు డబ్బింగ్ చెపుతున్నారు. కరుణాకరన్ దర్శకత్వంలో రానున్న ఈ "ఎందుకంటే....ప్రేమంట" చిత్రం యుత్ ఫుల్ లవ్ స్టోరీతో కూడిన ఎంటర్ టైనర్‍ చిత్రమని తెలిసింది. హీరో రామ్, తమన్నాల జోడీ చాలా బాగుందని తెలిసింది. ఈ "ఎందుకంటే....ప్రేమంట" చిత్రాన్ని రానున్న వేసవిలో విడుదల చేయనున్నారు.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.