English | Telugu

‘పటాస్’ పెద్దలకు మాత్రమే

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ చిత్రం ‘పటాస్’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది. కొన్ని హై వోల్టేజీ యాక్షన్ సన్నివేశాలు, ఓ మాస్ మసాలా సాంగ్ కారణంగా ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్ ఇష్యు చేసినట్లు తెలిసింది. ‘పటాస్’ ఈ నెల 23న విడుదలకు సిద్దమవుతోంది . కళ్యాణ్ రామ్ ఇందులో డైనమిక్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలై ఈ చిత్రం ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీ వర్గాల నుండి ఈ సినిమాపై మంచి రిపోర్ట్ వస్తుంది. కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.