English | Telugu

‘డెవిల్‌’ ఫస్ట్‌ రివ్యూ.. పబ్లిక్‌ రివ్యూ!

కళ్యాణ్‌రామ్‌ కెరీర్‌ను గమనిస్తే మొదటి నుంచి విభిన్నమైన సినిమాలు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. జయాపజయాలను పక్కన పెట్టి తను అనుకున్న దారిలోనే కొత్త తరహా సినిమాలపైనే దృష్టిపెడుతున్నాడు. తాజాగా నందమూరి కళ్యాణ్‌రామ్‌ హీరోగా రూపొందిన మరో డిఫరెంట్‌ మూవీ ‘డెవిల్‌’. ది బ్రిటీస్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ సినిమాపై మొదటి నుంచి మంచి హైప్‌ ఉంది. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్‌తో మరింత బజ్‌ తీసుకొచ్చారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? అసలు కాన్సెప్ట్‌ ఏమిటి? దర్శకుడు దాన్ని ఎలా డీల్‌ చేశాడు? కళ్యాణ్‌రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఎలా ఉంది? సినిమాకి ఉన్న టెక్నికల్‌ ఎస్సెట్స్‌ ఏమిటి? సినిమా చూసిన ప్రేక్షకుల రియాక్షన్‌ ఏమిటి? అనేది ఓసారి పరిశీలిద్దాం.
ఓ హత్యకేసును ఛేదించేందుకు నియమించిన బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌ హీరో అని ట్రైలర్‌ చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే అసలు ఆ హత్య ఎందుకు జరిగింది? అనేది సినిమాలోని ప్రధానమైన ట్విస్ట్‌ అంటున్నారు. కథ, కథనాలు చాలా బాగున్నాయని, కళ్యాణ్‌రామ్‌కి బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుందని పబ్లిక్‌ టాక్‌ వినిపిస్తోంది.

నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే.. నందమూరి కళ్యాణ్‌రామ్‌ ఎంతో ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాడు. ఇది ఒన్‌మేన్‌ షో. సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని తీసుకెళ్లాడు కళ్యాణ్‌రామ్‌ అంటున్నారు. ఇక హీరోయిన సంయుక్త మీనన్‌ కూడా బాగా చేసిందట. ఇద్దరి కెమెస్ట్రీ బాగా వర్కవుట్‌ అయిందంటున్నారు. ఓవరాల్‌గా సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారంటున్నారు.
టెక్నికల్‌ ఎస్సెట్స్‌ గురించి చెప్పాలంటే.. సినిమాకి బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ పెద్ద ప్లస్‌ అని చెబుతున్నారు. సినిమా కథ ఒక ఎత్తయితే, మ్యూజిక్‌ మరో ఎత్తు అనేది పబ్లిక్‌ చెబుతున్న మాట. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు మ్యూజిక్‌ అద్భుతంగా చేశారంటున్నారు. సినిమాకి ఇంత మంచి టాక్‌ రావడానికి మ్యూజిక్‌ ఒక కారణమవుతుందట.

ప్రస్తుతం వినిపిస్తున్న టాక్‌ అయితే సూపర్‌హిట్‌ అని. కళ్యాణ్‌రామ్‌కి ‘బింబిసార’ ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో దానికి ఎన్నో రెట్లు ‘డెవిల్‌’ హిట్‌ మూవీ అవుతుందని పబ్లిక్‌ అంటున్నారు. ఈ సినిమా దాదాపు సలార్‌కు దగ్గరగా వెళ్లిందన్న టాక్‌ కూడా పబ్లిక్‌ చెబుతున్నారు. నందమూరి అభిమానులు కాలర్‌ ఎగరేసుకొని తిరగొచ్చని అంటున్నారు. మరికొంత మంది సలార్‌తో ఈ సినిమాని పోల్చలేమని, దేని రేంజ్‌ దానిదే అంటున్నారు. ఈ సినిమాలోని కథగానీ, కథనంగానీ, ట్విస్టులు, యాక్షన్‌ సీక్వెన్స్‌లు.. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, కళ్యాణ్‌రామ్‌ పెర్‌ఫార్మెన్స్‌.. ఇలా ప్రతి ఒక్క అంశం బాగుంది అంటున్నారు. ఇది పబ్లిక్‌ చెబుతున్న మాట. అసలు సినిమా ఎలా ఉంది, ఆడియన్స్‌ ఫీల్‌ అయినట్టు ఇది ఎక్స్‌ట్రార్డినరీ మూవీ అవుతుందా అనేది ఫుల్‌ రివ్యూలో తెలుసుకుందాం.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.