English | Telugu

‘ఆ కుర్చీని మడతపెట్టి..’ మహేష్‌, శ్రీలీల ఇరగదీశారు!

డిసెంబర్‌ సినిమాల సందడి పూర్తయిపోయింది. ఇక అందరి దృష్టీ సంక్రాంతిపై పడింది. సినిమా లవర్స్‌‌కి సంక్రాంతి అంటే పెద్ద పండగ అనే చెప్పాలి. ఎందుకంటే టాప్‌ హీరోల సినిమాలు ఎక్కువగా సంక్రాంతికే రిలీజ్‌ అవుతుంటాయి. అలా సూపర్‌స్టార్‌ మహేష్‌ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ సంవత్సరం సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో మంట పుట్టించడానికి వస్తున్నాడు మహేష్‌. త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మహేష్‌ చేస్తున్న మూడో సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటూ సినిమామీద మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.అంతే కాకుండా సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పాటలు అందర్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ సినిమాలోని ఓ పాట మంచి ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించి విడుదలైన స్టిల్స్‌ ఎంతో ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను ఈరోజు విడుదల చేసింది చిత్ర యూనిట్‌. హీరోయిన్‌ శ్రీలీల గురించి అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే.. డాన్స్‌ ఇరగదీస్తుందని, దానికి మహేష్‌ కూడా తోడైతే ఆ కాంబినేషన్‌లో రూపొందిన పాట ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ ప్రోమోలో పాటకు సంబంధించిన చిన్న ముక్క మాత్రమే చూపించారు. అది కూడా ఎంతో జోష్‌తో ఉంది. ‘ఆ కుర్చీని మడత పెట్టి..’ అని మహేష్‌ అనడం.. వెంటనే ఫాస్ట్‌ బీట్‌తో వచ్చే పాటకు మహేష్‌, శ్రీలీల వేసిన స్టెప్స్‌ అదిరిపోయాయి. అంత చిన్న బిట్‌లోనే డాన్స్‌ ఇరగదీశారు అనిపిస్తోంది. ఇక ఫుల్‌ పాట ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రోమో సినిమాకి హండ్రెడ్‌ ప్లస్‌ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.