English | Telugu
నటుడు కళాభవన్ మణి శరీరంలో విష రసాయనాలు
Updated : Mar 18, 2016
కొద్ది రోజుల క్రితం నటుడు కళాభవన్ మణి మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై అనుమానాలున్నట్లు అప్పుడే వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఆయన శరీరంలో పురుగుల మందుల అవశేషాలు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. కోచిలో కెమికల్ ఎగ్జామినర్ టాక్సికాలజీ పరీక్షల్లో, ఆయన శరీరంలో అత్యంత ప్రమాదకరమైన ఇన్సెక్టిసైడ్ క్లోర్ పైరిఫోస్, మిథైల్, ఇథైల్ ఆల్కహాల్ కు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. ఇప్పటికే మణికి లివర్ వ్యాధి ఉందని అందరూ అనుకున్నా, ఆయన భార్య నిమ్మే మాత్రం ముందు నుంచీ ఆయనది అనుమానాస్పద మృతే అంటే వాదిస్తూ వచ్చారు.
ఒకవేళ ఆత్మహత్య అనుకున్నా, ఆయనకు అలాంటి ఖర్మ లేదని ఆవిడ అంటున్నారు. ఆటోరిక్షా డ్రైవర్ గా జీవితాన్ని మొదలెట్టిన కళాభవన్ మణి, తన మిమిక్రీ ప్రతిభతో నాటకాల్లో రాణించి ఆ తర్వాత సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మార్చి 6న కొచ్చిలో చికిత్స పొందుతూ మణి మృతి చెందారు. ఆయన మృతిపై ప్రధానమంత్రి సహా, అనేక మంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మణి అభిమానులు ఆయన మరణంపై లోతైన విచారణ జరగాలని కోరుకుంటున్నారు.