English | Telugu
టెంపర్ లోకి విశాల్ ఎంట్రీ..శింబు అవుట్..?
Updated : Mar 18, 2016
ఎన్టీఆర్ కెరీర్లో వన్నాఫ్ ది బెస్ట్ పెర్ఫామన్స్ ఇచ్చిన సినిమా టెంపర్. డల్ అయిపోయిన తారక్ కెరీర్ ను బూస్టప్ చేయడమే కాక, మంచి హిట్ గా నిలిచిన సినిమా అది. యాక్షన్ తో పాటు, సెంటిమెంట్, ఫ్యామిలీలను లాక్కొచ్చే స్టోరీ కావడంతో టెంపర్ కథకు డిమాండ్ పెరిగింది. దాంతో రీమేక్ ల కోసం చాలా మంది పోటీ పడినా చివరికి మైకేల్ రాయప్పన్ తమిళ టెంపర్ రైట్స్ ను దక్కించుకున్నారని, విజయ్ చందర్ డైరెక్షన్లో, శింబు నటిస్తాడనే ప్రచారం జరిగింది.
తాజాగా శింబు ప్లేస్ లో విశాల్, విజయ్ చందర్ ప్లేస్ లో అనల్ అరసులు రీప్లేస్ అయ్యారు. విశాల్ ప్రస్తుతం తుప్పారివాలన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తవ్వగానే టెంపర్ షూట్లోకి ఎంటరౌతాడట. డైరెక్టర్ గా మారిన ఫైట్ మాస్టర్ అనల్ అరసు ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. హీరోయిన్ కాజల్, తమిళ టెంపర్లో కూడా యాక్ట్ చేయనున్న సంగతి తెలిసిందే. కాజల్ ఇంతకు ముందు పాయుం పులిలో కలిసి నటించారు. టాగూర్ మథు తమిళ టెంపర్ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం కొసమెరుపు.