English | Telugu
టెంపర్ చూపిస్తున్న కాజల్
Updated : Mar 10, 2016
డౌన్ అయి మళ్లీ పుంజుకున్న చందమామ కాజల్ ఇప్పుడు వరస సినిమాలతో బిజీ అయిపోయింది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం, ఎన్టీఆర్ టెంపర్ రీమేక్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది మిత్రవింద. ఆల్రెడీ బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఉన్న ఈ అమ్మడికి, తమిళ్ టెంపర్ హిట్టు పడిందంటే, కెరీర్ టాప్ గేర్ కి చేరుకున్నట్టే. ఆ క్యారెక్టర్ కు బాగా సెట్టవడం, తమిళంలో కూడా మంచి హిట్టు సినిమాలున్న కారణంగానే, రీమేక్ కు కాజల్ ను ప్రిఫర్ చేసినట్టు తెలుస్తోంది. విజయ్ చందర్ డైరెక్షన్లో మైకేల్ రాయప్పన్ నిర్మాతగా తమిళ టెంపర్ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయబోతోంది. మొత్తమ్మీద వరస క్రేజీ ప్రాజెక్ట్ప్ తో, తన అందానికున్న డిమాండ్ ను మరోసారి ప్రూవ్ చేసుకుంటోంది కాజల్.