English | Telugu
త్రివిక్రమ్ "అ...ఆ".. రిలీజ్ డేట్ ఫిక్స్..!
Updated : Mar 11, 2016
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో నితిన్ హీరోగా.. సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం "అ...ఆ" (అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి). అసలు ఎలాంటి హడావుడి లేకుండా షూటింగ్ పని కానిచేస్తున్నారు త్రివ్రికమ్. అయితే ముందు ఈ చిత్రాన్ని ఏప్రిల్ నెలలో రిలీజ్ చేద్దామనుకున్నారు.. కానీ మే 6న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ లో బన్నీ నటించిన సరైనోడు, పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం సినిమాలు కూడా రీలీజ్ చేసేందుకు రెడీ అవుతుండటంతో తమ సినిమా రిలీజ్ ను మే నెలకి షిఫ్ట్ చేసినట్టు భావిస్తున్నారు. కాగా ఈసినిమాలో సమంత మెయిన్ హీరోయిన్ కాగా అనుపమ పరమేశ్వరన్ మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అవడంతో.. దీనికి సంబంధించిన పోస్టర్లు.. టీజర్స్ త్వరలో విడుదల చేయనున్నారు.