English | Telugu
మూడు కోట్లు గుంజిన హీరోయిన్!
Updated : Dec 5, 2014
అమ్మో.... కాజల్ యమా ఫాస్టుగా ఉంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకొని సెటిలైపోదామనుకొంటోందేమో.. ఒక్కసారిగా పారితోషికం పెంచేసింది. కోటి, రెండు కోట్లు దాటి మూడు కోట్ల కథానాయికగా అవతరించింది. విశాల్ కథానాయకుడిగా తమిళంలో ఓ సినిమా చేస్తోంది. ఈసినిమా తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఒకేసారి తెలుగు, తమిళ చిత్రాల సన్నివేశాల్ని మార్చి మార్చి తెరకెక్కిస్తున్నారు. దాంతో.. `చేస్తోంది రెండు సినిమాలకు కదా.. అందుకే మూడు కోట్లు ఇవ్వండి` అంటూ డిమాండ్ చేసిందట. అసలే విశాల్ పక్కన హీరోయిన్ అనగానే అందరూ చెట్టేక్కేస్తారు. కనీవినీ ఎరుగని పారితోషికం డిమాండ్ చేస్తుంటారు. ఎలాగూ విశాలే నిర్మాత కాబట్టి... అడిగినంత పారితోషికం ఇచ్చేస్తుంటాడు. కాజల్‌కీ అలా మూడు కోట్ల రూపాయలు ముట్టజెప్పాడట. కాజల్ కెరీర్‌లో అత్యధిక పారితోషికం అందుకొన్న సినిమా ఇదే. మొన్నటికి మొన్న పూజ కోసం కూడా శ్రుతిహాసన్ బాగానే గుంజుందని.. తమిళ వర్గాల టాక్. మొత్తానికి విశాల్ అనేసరికి ఇప్పుడు హీరోయిన్లు ఎగబడుతున్నారు. పారితోషికం పేరుతో.. కోట్లు వెనకేసుకోవచ్చని. కాజల్, శ్రుతిహాసన్‌లకు విశాల్ బాగానే వర్కవుట్ చేశాడన్నమాట.