English | Telugu

బ‌డా ప్రొడ్యూస‌రు..ఏమాత్రం ఇచ్చాడో...?

పేరుకాయ‌న గొప్ప ప్రొడ్యూస‌రు. ఎంత గొప్ప‌.. అంటే స్టార్లంద‌రితోనూ సినిమాలు తీశాడు. బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు దొర‌క‌లేదు గానీ.. వాళ్ల‌తోనూ సినిమాలు ప్లాన్ చేసినోడే. టాలీవుడ్‌లో ఆయ‌న జ‌డ్జిమెంట్‌కు తిరుగులేదు అన్నంత పేరు సంపాదించుకొన్నాడు. పెద్ద హీరోల‌తోనూ ఫ్యామిలీ స‌బ్జెక్టులు చేసే స‌త్తా ఉన్న ప్రొడ్యూస‌రు. నైజాం ప్రాంతాన్ని ఏలేస్తాడు. ఇక్క‌డ బ‌డా సినిమా రిలీజ్ చేయాలంటే ఆయ‌న్ని సంప్ర‌దించాల్సిందే. ఆయ‌న వ‌ద్దంటే..మిగిలిన వాళ్ల‌కు ఆఛాన్స్ వెళ్తుంది. అలాంటి మ‌హోన్న‌త‌మైన నిర్మాత `హుద్ హుద్` బాధితుల‌కు విరాళంగా ఒక్క పైసా రాల్చ‌లేదంటే న‌మ్ముతారా? చిన్నా చిత‌కా హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లూ త‌మ‌కు తోచినంత ఆర్థిక స‌హాయం అందించి మేము సైతం అంటూ ముందుకొచ్చారు. ఆఖ‌రికి ఒక్క సినిమా పిల్లాడు సంపూర్నేష్ బాబు కూడా ల‌క్ష రూపాయ‌లు విరాళం అందించాడు. మ‌రి ఈ బ‌డా ప్రొడ్యూస‌ర్‌కి చేతులు మాత్రం రాలేదు. ఆంధ్రాలో సినిమాల్ని విడుద‌ల చేసుకొంటాడు.. అక్క‌డి రెవిన్యూ కావాలి, అక్క‌డి హీరోల‌తో హిట్లు కొడ‌తాడు.. కానీ ఆంధ్రా వాళ్ల క‌ష్టాలు మాత్రం క‌నిపించ‌లేదు.ఆంధ్రోళ్ల క‌ష్టాలూ, క‌న్నీళ్లూ వ‌ద్దు..కానీ అక్క‌డి వ‌సూళ్లు, రికార్డులు మాత్రం కావాలా? రేప‌టి రోజున వైజాగ్‌లో అడుగు పెట్టి - మా సినిమా చూడండి నాయ‌న‌లారా అంటే అక్క‌డి జ‌నం - స్పందిస్తారా?? సినిమాల ద్వారా నీతి - సాయం - స‌హ‌కారం అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పిస్తే టూ మ‌చ్ గా ఉండ‌దూ..!ఏంటో ఆ మాత్రం అవ‌గాహ‌న లేకుండా పోయింది ఈ బ‌డా నిర్మాత‌కు. పాపం.. ఈయ‌నే సినిమాలు ఫ్లాప్ అయ్యి దివాళా తీసే ప‌రిస్థితిలో ఉన్నాడేమో..??