English | Telugu

రజనీ కబాలీ అయితే హృతిక్ కాబిల్..!

సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలీ గా వస్తున్నాడనే సంగతి మనకి తెలుసు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కాబిల్ అనే పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హృతిక్, యామీ గౌతమ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఈ రోజు తన ట్విట్టర్ లో రిలీజ్ చేశాడు హృతిక్. ఆయన తండ్రి రాకేష్ రోషన్ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, రాజేష్ రోషన్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా షూటింగ్ మొదలైన రోజే, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం కాబిల్ ప్రత్యేకత. ఫస్ట్ లుక్ ను పోస్ట్ చేస్తూ, నన్ను చూస్తున్న లక్షల కళ్లు నాకు చూపు లేకుండా చేశాయి. నిజానికి నేనే అన్నీ చూస్తున్నాను, మైండ్ లో ఉన్న కన్ను అన్నీ చూస్తూనే ఉంటుంది అని ట్వీట్ చేశాడు. కాబిల్ టైటిల్ కు మైండ్ సీస్ ఆల్ అనే ట్యాగ్ లైన్ నే ఫిక్స్ చేశారు. హృతిక్ ఫ్యాన్స్ లో ఈ ట్యాగ్ లైన్ ఆసక్తిని కలిగిస్తోంది. సినిమా ఏ జానర్లో తెరకెక్కుతుంది, అసలెలా ఉండబోతోంది అన్న ప్రశ్నలు కలిగించేలా ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను డిజైన్ చేశారు. 2017 జనవరి 26 న కాబిల్ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.