English | Telugu
కబాలీ గురించి అప్ డేట్ ఇచ్చిన సూపర్ స్టార్..!
Updated : Apr 13, 2016
రజనీ సినిమా అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలు వరస ఫ్లాపులున్నా, ఆ తర్వాత వచ్చే ప్రతీ సినిమాకూ, ఆడియన్స్ లో అంచనాలు మాత్రం భారీగానే ఉంటాయి. అదీ రజనీ స్టామినా. లేటెస్ట్ గా ఆయన నటించిన కబాలీ గురించి కూడా ఫ్యాన్స్ అలాగే ఎదురుచూస్తున్నారు. సినిమా చెప్పిన టైంకే వస్తుందనుకున్న వాళ్లకు పోస్ట్ పోన్ అయిందన్న వార్త చాలా నిరాశను కలిగించింది. ఈ విషయం రజనీ వరకూ కూడా వెళ్లింది. దాంతో వెంటనే పుకారును ఖండించారు. సినిమా అనుకున్న టైం కే మే లాస్ట్ వీక్ కు వచ్చేస్తుందని, ఒక వేళ అంతగా మార్పులు చేర్పులు ఉంటే జూన్ ఫస్ట్ వీక్ కైనా మూవీని రిలీజ్ చేస్తామని క్లియర్ గా చెప్పేశారు రజనీ. నిన్న పద్మవిభూషణ్ అందుకున్న రజనీ, ఆ సందర్భంగా ఈ విషయాన్ని క్లారిఫై చేశారు. ఇది రజనీ అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరో వైపు కబాలీ టీజర్ ను కూడా త్వరలోనే రిలీజ్ చేద్దామనుకుంటున్నారు రజనీ అండ్ కో. ఈ టీజర్ కూడా చాలా కొత్తగా డిజైన్ చేశామని మూవీ టీం చెబుతున్నారు. కబాలీ బాషాకు కంటిన్యూషన్ అంటూ ప్రచారం జరుగుతుండటం విశేషం.