English | Telugu
కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న జంగిల్ బుక్..!
Updated : Apr 9, 2016
ఇప్పుడు పెద్దవాళ్లైపోయిన చాలా మందికి ఫేవరెట్ సీరియల్ జంగిల్ బుక్. ఒకప్పుడు కేవలం దూరదర్శన్ మాత్రమే ఛానల్ గా ఉన్నప్పుడు జంగిల్ బుక్ ఎప్పుడెప్పుడొస్తుందా అని పిల్లలు ఎదురుచూసేవాళ్లంటే అతిశయోక్తి లేదు. జంగిల్ జంగిల్ బాత్ చలీ హై అంటూ పాట రాగానే పిల్లలందరూ మైమరిచిపోయేవారు. సీరియల్ చూపిస్తూ, పిల్లలకు అన్నం తినిపించిన తల్లులు కూడా ఉన్నారు. ఇండియాలో ఇంత పేరుంది గనుకే, అత్యంత భారీ రేంజ్ లో మన దగ్గర కూడా సినిమాను రిలీజ్ చేశారు.
అద్భుతమైన రేటింగ్ లు, రివ్యూ లు సాధించిన ఈ సినిమా ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా దూసుకుపోవడమే కాక, 10.09 కోట్లతో ఈ ఏడాది బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు తెచ్చుకున్న రెండో సినిమాగా నిలిచింది. మొదటి స్థానంలో అక్షయ్ కుమార్ ఎయిర్ లిఫ్ట్ ఉంది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కన్ఫామ్ చేశాడు. ఇది కేవలం మొదటి రోజు కలక్షన్ మాత్రమే. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సర్దార్ తప్ప వేరే సినిమా లేదు. దేశవ్యాప్తంగా పిల్లలకు వేసవి సెలవులు. దీని బట్టి చూస్తే, జంగిల్ బుక్ రికార్డ్ కలెక్షన్లు సాధించడం ఖాయమే అంటున్నారు ట్రేడ్ పండితులు.