English | Telugu

బండ్ల గణేష్‌ ఇంట్లో పార్టీ.. అందరూ కలవడానికి కారణం అదేనా?

1996లో ఎస్‌.వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘వినోదం’ చిత్రంలో నటుడిగా పరిచయమైన బండ్ల గణేశ్‌.. తొలి సినిమాతోనే కమెడియన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 13 సంవత్సరాలపాటు నటుడిగా కొనసాగుతూ హీరోలకు, డైరెక్టర్ల, నిర్మాతలకు బాగా దగ్గరయ్యారు. 2009లో రవితేజ హీరోగా నటించిన ‘ఆంజనేయులు’ చిత్రంతో నిర్మాతగా మారారు. గబ్బర్‌ సింగ్‌, బాద్‌షా, టెంపర్‌ వంటి 8 సినిమాలు నిర్మించారు. 2015 నుంచి సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేశ్‌.. రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అయితే అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చే గణేశ్‌.. తాను త్వరలోనే భారీ సినిమాలు నిర్మించబోతున్నానని ప్రకటిస్తూ ఉంటారు. కానీ, దాదాపు పదేళ్లుగా ఒక్క సినిమా కూడా ఎనౌన్స్‌ చెయ్యలేదు.

ఇదిలా ఉంటే.. సడన్‌గా టాలీవుడ్‌లోని ప్రముఖులంతా బండ్ల గణేశ్‌ ఇంటికి చేరారు. అందరూ కలిసి అక్కడ సందడి చేశారు. కె.రాఘవేంద్రరావు, కృష్ణవంశీ, బి.వి.ఎస్‌.రవి, అలీ, శ్రీకాంత్‌, బ్రహ్మాజీ, శివాజీరాజా, శివాజీ, రాజా రవీంద్ర వంటి సినీ ప్రముఖులు గణేశ్‌ ఇంటిలో సమావేశమయ్యారు. దీనికి కారణం.. బండ్ల గణేశ్‌ ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనే ఈ పార్టీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వివిధ భాషలకు చెందిన నటీనటులు రీయూనియన్‌ పేరుతో ప్రతి ఏటా కలిసి సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బండ్ల గణేశ్‌ ఇంట్లో జరిగిన పార్టీ కూడా అలాంటిదనే చెప్పాలి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.