English | Telugu

టెన్షన్ లో 'రాజా సాబ్' మూవీ టీమ్.. షూటింగ్ కష్టమేనా..?

తెలుగు సినీ కార్మికులు సమ్మె విరమించడంతో మళ్ళీ షూటింగ్ లు మొదలయ్యాయి. అయితే ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజా సాబ్' షూటింగ్ మళ్ళీ మొదలవుతుందా? అసలు సినీ కార్మికులు ఈ షూటింగ్ కి హాజరవుతారా లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. ఎట్టకేలకు ఇప్పుడు ఆ సస్పెన్స్ కి తెరపడినట్లు తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న 'రాజా సాబ్' కొత్త షెడ్యూల్ ను రేపటి(ఆగస్టు 25) నుంచి ప్లాన్ చేశారు. అయితే ఈ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందా లేదా? అనే టెన్షన్ మూవీ టీంలో నెలకొంది.

సినీ కార్మికుల సమ్మె సమయంలో ఈ చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఫెడరేషన్‌కు లీగల్ నోటీసులు ఇచ్చారు. సమ్మె విరమించిన తర్వాత ఆ నోటీసులు విత్ డ్రా చేసుకుంటానని ప్రకటించారు. అయినప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు విశ్వప్రసాద్ పై గుర్రుగా ఉన్నాయట. దీంతో 'రాజా సాబ్' షూటింగ్ ఉంటుందా లేదా? అని ప్రభాస్ ఫ్యాన్స్ లోనూ టెన్షన్ మొదలైంది.

అయితే 'రాజా సాబ్'కి లైన్ క్లియర్ అయిందని, రేపటి నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. ఈనెలాఖ‌రు వ‌ర‌కూ అజీజ్ న‌గ‌ర్ లో జరగనున్న ఈ షెడ్యూల్ లో ప్ర‌భాస్ పై కొన్ని కీల‌క‌ స్న‌నివేశాలను చిత్రీకరించనున్నారు. సెప్టెంబ‌రు 17 నుంచి కేర‌ళ‌లో ప్ర‌భాస్ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ షూట్ చేయనున్నారు. ఆ తర్వాత విదేశాల్లో రెండు పాట‌లు చిత్రీక‌ర‌ణ‌ ఉంటుంది. దాంతో రాజాసాబ్ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

'రాజా సాబ్'ని డిసెంబర్ 5న విడుదల చేయనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే ఇప్పుడు 2026 సంక్రాంతికి వాయిదా పడినట్లు వార్తలొస్తున్నాయి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.