English | Telugu
సన్నీ లియోన్‌తో డేటింగ్ చేస్తున్న హీరో
Updated : May 31, 2014
మీడియా కొంతమంది చుట్టే తిరుగుతుందా, లేక వాళ్లు మీడియాని తమ చుట్టు తిప్పుకోగలరా... ఏమో కానీ మీడియాను తమ చుట్టూ తిప్పుకోవడానికి కొంతమంది ఏదైనా చేస్తుంటారనిపిస్తుంది. గూగుల్ మోస్ట్ సెర్చ్‌డ్ గర్ల్ సన్ని లియోన్ కూడా అలాగే చేస్తోందా అనిపిస్తోంది ఈ విషయం తెలిసాక. రోజుకో వార్తతో వార్తల్లో నిలుస్తుంది ఈమె. ఈ సెక్సీ స్టార్‌కి పబ్లిసిటీ కోసం స్టంట్‌లు చేయాల్సిన పనిలేదు. పబ్లిసిటీనే ఆమె వెనుకాల పరిగెట్టుకుంటూ వస్తుంటుంది. అదేంటో అయినా ఈమెకు అది చాలనట్లు కొత్త కొత్త స్టేట్‌మెంట్లు ఇస్తోంది. సన్నీఒక సాంగ్‌లో కనిపిస్తోంది అన్నా, సినిమా సైన్ చేస్తోంది అని న్యూస్ వచ్చినా ఆ సినిమా హైప్ పెరిగిపోతోంది. ఒక్క సాంగ్‌లో సన్నీ మెరిసినా, ఆ సినిమాకు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటోంది.
అలాంటిది ఒక హీరోతో డేటింగ్ చేస్తున్నా అని తాజాగా వెల్లడించింది సన్నీ. దాంతో ఆ హీరో గురించిన టాక్ అక్కడ హాట్ టాక్ అయింది. ఇంతకీ ఆ అదృష్టవంతుడు జాన్ అబ్రహం. వీరిద్దరూ కలిసి షూట్ అవుట్ ఎట్ వదాల అనే హిందీ మూవీలో కలిసి ఓ ఐటెం సాంగ్ లో కనిపించారు. అప్పటి నుంచి తామిద్దరు ఇలా డేటింగ్ కంటిన్యూ చేస్తున్నట్లు సన్నీ లియోన్ మీడియాతో చెప్పుకుంది. మీడియా ముందు ఎప్పుడూ పర్సనల్ విషయాలు మాట్లాడని సన్నీ లియోన్ ఇలా ఎందుకు మాట్లాడిందో తెలియదు. పాపులారిటీ కోసం అప్పుడప్పుడు ఇలా హీరోయిన్లు మీడియా ముందుకు వస్తుంటారు. మరి సన్నీ ఇలా ఎందుకు చేసిందో తెలియదు కానీ, ఇంకా ఆ లిస్టులో ఎవరెవరి పేర్లు చెబుతుందో అని భయపడుతున్నారట.