English | Telugu

చావు దాకా వెళ్లి బయటపడ్డ జగపతి

యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన వరం. తిండి లేకపోయినా..నీళ్లు లేకపోయినా మనిషి బతకవచ్చు. కాని గాలి లేకపోతే మాత్రం మనిషి బతకలేడు. అయితే యోగాపై పట్టున్న వారికి గాలి లేకపోయినా డోంట్ వర్రి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సియాచిన్ దుర్ఘటనలో వేల టన్నుల మంచు మీద పడినా..35 అడుగుల లోతులో ఇరుక్కుపోయినా..నాలుగు రోజుల పాటు కొన ఊపిరితో బ్రతికారు లాన్స్ నాయక్ హనుమంతప్ప. అచ్చం అలాంటి పరిస్థితినే ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డారు నటుడు . ఓ సారి ఆయన ఓ సినిమాలో యాక్షన్ సీన్ చేశాడు. అందులో ఓ సీన్ కోసం ఆయనను భూమి లోపల పాతిపెట్టారు. ఆ సినిమా యూనిట్ వాళ్లంతా జగపతి బాబు గురించి చాలా టెన్షన్ పడ్డారట. అయితే చివరి నిమిషంలో చాలా స్పీడ్‌గా భూమి లోపల నుంచి జగపతి బాబుని బయటకు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. బయటకు వచ్చేంతవరకు లోపల గాలి లేదు. అయినప్పటికీ అంత సేపు ఎలా ఉండగలిగారని చిత్ర యూనిట్ అడిగితే..ఆ టైంలో యోగా చేస్తూ..శ్వాస మీద దృష్టి పెట్టడం వల్లనే తను బతికి బయటపడినట్లు జగపతిబాబు ఇటీవల స్వయంగా వెల్లడించాడు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.