English | Telugu

ప‌వ‌న్ వాచ్‌... టాక్ ఆఫ్ ది టౌన్‌..!

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. స్టాఫ్‌కి కూడా జీతాలు చెల్లించ‌లేని ప‌రిస్థితి... అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ లాంటి స్టార్ మొర‌పెట్టుకోవడం షాక్ నిచ్చింది. సినిమాకి రూ.20 కోట్లు తీసుకొనే ఓ హీరో మాట్లాడాల్సిన మాట‌లేనా ఇవి అని కొంద‌రు, ప‌వ‌న్ అలా అన్నాడంటే ఎన్ని క‌ష్టాల్లో ఉన్నాడో అని మ‌రికొంద‌రు... తెగ నివ్వెర‌పోయారు. అయితే... ప‌వ‌న్ కూడా ఖ‌రీదైన జీవితం మ‌ధ్యే ఉన్నాడ‌ని, విలాసాల మ‌ధ్యే బ‌తుకుతున్నాడ‌ని ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ని చూస్తే అర్థ‌మ‌వుతోంది. మొన్న‌ అ ఆ ఆడియో ఫంక్ష‌న్‌కి ప‌వ‌న్ వ‌చ్చాడు. ప‌వ‌న్ చేతికున్న వాచ్ పై అంద‌రి క‌ళ్లూ ప‌డ్డాయి. అది మామూలు వాచ్ కాదు. బ్రెట్లింగ్ బ‌ర్నాటో కంపెనీకి చెందిన ఈ వాచ్ ఖ‌రీదు క‌నీసం రూ.4 ల‌క్ష‌లైనా ఉంటుంద‌ని టాక్‌.

ఎప్పుడూ సాదా సీదా జీవితం గురించి పుంకానుపుంకానులు మాట్లాడే ప‌వ‌న్ ఇంత ఖ‌రీదైన వాచ్ ఎలా పెట్టుకొచ్చాడు చెప్మా?? అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. అదెవ‌రైనా బ‌హుమ‌తిగా ఇచ్చారా, లేదంటే ప‌వ‌న్ ఇష్ట‌ప‌డి కొనుక్కొన్నాడా అన్న‌ది టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. స్టార్లు ఇలాంటి ఖ‌రీదైన వాచీలు పెట్టుకోవ‌డం మామూలే. కాక‌పోతే.. 'డ‌బ్బుల్లేవు' అని చెప్పుకొనే ప‌వ‌న్‌.. 'నేను సాధార‌ణ జీవితాన్నే ఇష్ట‌ప‌డ‌తా' అని ప్ర‌క‌టించుకొనే ప‌వ‌న్ మ‌రీ ఇంత కాస్ట్లీ వాచ్‌ల‌తో క‌నిపిస్తేనే.. ఇలా ర‌క‌ర‌కాలుగా మాట్లాడుకోవాల్సివ‌స్తుంది మ‌రి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.