English | Telugu

అన్ని సినిమాలు సర్దార్ ను ఆడుకుంటున్నాయి..!

పవన్ సినిమా వస్తుందని భయపడిన సినిమాలన్నీ ఇప్పుడు సర్దార్ ముందే ఖుషీ ఖుషీగా తోకజాడించేస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ కున్న క్రేజ్ చూసి, ఆ సినిమాకు వారం ముందు వారం వెనుక అన్ని సినిమాలూ రావచ్చా వద్దా అని భయపడ్డాయి. కానీ ఎప్పుడైతే యావరేజ్ టాక్ తెచ్చుకుందో, అక్కడితో సర్దార్ కథ కంచికెళ్లిపోయింది. నెగటివ్ పబ్లిసిటీని మిగిలిన సినిమాలు క్యాష్ చేసుకున్నాయి. ప్రస్తుతం సర్దార్ ఆడుతున్న అన్ని థియేటర్లలోనూ, కొత్త సినిమాలు చిన్న సినిమాలూ నింపేస్తున్నాయి. ఓ పక్క సర్దార్ కంటే ముందే రిలీజైన ఊపిరి, కంఫర్టబుల్ గా, తన పని తను చేసుకెళ్లిపోతోంది. ఆ సినిమాకు పవన్ ఎఫెక్ట్ తగల్లేదు. ఇక నిన్న రిలీజైన మంచు విష్ణు రాజ్ తరుణ్ ల ఈడో రకం ఆడో రకం సినిమా టైం పాస్ మూవీ అంటూ పాజటిలివ్ టాక్ తెచ్చుకోవడం, తెలుగులోనూ తమిళంతో సమానంగా దిల్ రాజు రిలీజ్ చేసిన పోలీస్, తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తానంటూ వస్తున్న షారుఖ్ ఫ్యాన్ , సర్దార్ ను ఇంటికి పంపే ఏర్పాట్లలో ఉన్నాయి. ప్రతీ కొత్త సినిమా, చిన్న సినిమా కూడా సర్దార్ పై ప్రభావం చూపించడం విచిత్రం. అంతే మరి. ఓడలు బళ్లౌతాయి. బళ్లు ఓడలవుతాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.