English | Telugu

అది విశాల్ అంటే..!

తమను ఇంత స్థాయికి తీసుకొచ్చిన జనం కష్టాల్లో ఉన్నపుడు సాయం చేయడానికి వెండితెర వేల్పులు ఎప్పుడూముందేఉంటారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఏ వుడ్ తీసుకున్నా అందరి స్టార్స్ మాట ఒక్కటే..వీరిలో తమిళ
యువహీరో విశాల్ మాత్రం ప్రత్యేకం. ఆపదలో ఉన్నవారికి నేనున్నంటూ ఆపన్న హస్తం అందించడంలో విశాల్ ఎప్పుడూవెనుకడుగు వేయడు. చెన్నై వరదల సమయంలో మోకాళ్ల లోతు నీటిలో సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నాడు. ఆతర్వాత అంతకు ముందు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించాడు విశాల్.

తాజాగా ఈ నెల 19న చెన్నైలో మద్యం మత్తులోఓ వ్యక్తి కారును నడిపి 13 ఆటోలను ఢీ కొట్టిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తూఆర్ముగం అనే వ్యక్తి మరణించాడు. ఆయన మరణంతో అతని కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. దీంతో ఆర్ముగంకుటుంబాన్ని ఆదుకోవడానికి విశాల్ ముందుకు వచ్చాడు. అతని స్వగ్రామానికి వెళ్లి అతని కుటుంబసభ్యుల్ని పరామర్శించికిరణా షాపు పెట్టుకునేందుకు, వారి కుమార్తె చదువుకయ్యే ఖర్చును భరిస్తానని మాట ఇచ్చాడు. ఈ వార్త తెలియడంతోవిశాల్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేశారు.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.