English | Telugu

మెగాస్టార్ సెటిల్‌మెంట్..

సుమారు తొమ్మిది సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాఖైదీ నెంబర్.150. చిరంజీవి సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు. సినిమా షూటింగ్ ఎలా జరుగుతుంది..మెగాస్టార్ ఎలా ఉన్నారోనన్న ఎంగ్జయిటి అభిమానులను వేధిస్తోంది. దీంతో సినిమాకు సంబంధించినసమాచారం కోసం అభిమానులు నెట్లో తెగ వెతికేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలోమెగాస్టార్ మూవీకి సంబంధించిన ఓ స్టిల్ కంటపడటంతో అది పెద్ద వార్తయి కూర్చొంది. ఈస్టిల్‌లో నడుచుకుంటూ వస్తోన్న చిరుని చూసి చుట్టూ జనాలంతా లేచి నిలబడి ఉన్నారు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూస్తూ ఉంటే అక్కడేదో సెటిల్‌‌మెంట్ జరగబోతోందని అర్థమవుతోంది. కత్తి సినిమాలో రైతులకు సంబంధించిన లైన్ ఉండటంతో ఖైదీ నెం.150లోనూ ఆ సన్నివేశాన్ని పెట్టినట్లున్నట్లు తెలుస్తోంది. ప్రజంట్ ఆ పిక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.