English | Telugu

పవన్ మూవీ నుంచి సెకండ్ వికెట్ డౌన్...

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా డిజాస్టర్ తర్వాత అభిమానులకు అదిరిపోయే హిట్టవ్వాలని ఫిక్స్ అయిన పవర్ స్టార్పవన్‌కళ్యాణ్‌కు అన్ని గండాలే ఎదురవుతున్నాయి. శరత్ మరార్ నిర్మాతగా ఎస్‌జె సూర్య దర్శకత్వంలో "కడపకింగ్" అనేమూవీ అనుకోవడం, ఆ వెంటనే ముహుర్తపు షాట్స్ జరుపుకోవడం అన్ని వేగంగా జరిగిపోయాయి. అయితే ఈ మూవీ డైరెక్టర్‌ ఎస్‌జె సూర్యకు నటుడిగా అవకాశాలు పోటెత్తడంతో ఏకంగా ప్రాజెక్ట్ నుంచే వైదొలిగడంతో అతని ప్లేస్‌లో డాలీ వచ్చి చేరాడు. డాలీ తన మార్క్‌తో స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు కూడా చేశాడు.

అనేక తర్జనభర్జనల తర్వాత సినిమాకు "కాటమరాయుడు" అని టైటిల్ ఫిక్స్ చేసి షూటింగ్‌కు ప్లాన్ చేసుకుంటున్న వేళ మరో షాక్ తగిలింది. ఈ చిత్ర కెమెరామ్యాన్ సౌందర్‌రాజన్ కూడా టాటా చెప్పేశాడు. షూటింగ్ రోజుకి రోజుకి ఆలస్యమవ్వడంతో సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు అతను ప్రకటించాడట. దీంతోసౌందర్ ‌రాజన్ ప్లేస్‌లో ప్రసాద్ మూరెళ్లను కెమెరామ్యాన్‌గా తీసుకుంటున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. మొత్తానికి ఈసినిమా షూటింగ్ కంప్లిట్ అయ్యే సరికి ఇంకెన్ని వికెట్లు డౌన్ అవుతాయో వేచి చూడాలి.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.