English | Telugu

చియాన్‌ 62 అనౌన్స్‌మెంట్‌.. ఊరమాస్‌ అంటున్న ఫ్యాన్స్‌

తను పోషించే పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసి వాటికి ప్రాణం పోయటానికి ఎంతటి రిస్క్‌ చేయటానికైనా వెనుకాడని అతి కొద్ది మందిలో చియాన్‌ విక్రమ్‌ ఒకరు. ఇప్పటికే తంగలాన్‌, ధ్రువ నక్షత్రం వంటి సినిమాలతో ఆయన సందడి చేయటానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన 62వ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చేసింది. అది కూడా వీడియో గ్లింప్స్‌ రూపంలో. దీన్ని చూస్తుంటే ఈసారి చియాన్‌ విక్రమ్‌ పక్కా మాస్‌ కమర్షియల్‌ ఫార్ములా మూవీతో మెప్పించబోతున్నారని అర్థమవుతుంది. పోలీస్‌ స్టేషన్‌కు హీరో వచ్చి అక్కడున్న పోలీసులను చితకబాదుతాడు. వాళ్లలో ఒకడు ఎవరు నువ్వు అడిగితే .. నేను డిప్యూటీ కమీషనర్‌ అని (విక్రమ్‌ సామి చిత్రంలో డైలాగ్‌) చెబుతాడు. ఈ వీడియో గ్లింప్స్‌లో హీరో ఫేస్‌ ఎక్కడా రివీల్‌ కాకుండా మాస్‌గానే చూపించారు దర్శకుడు కె.యు.అరుణ్‌ కుమార్‌.

హెచ్‌.ఆర్‌.పిక్చర్స్‌ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది. వచ్చే ఏడాది నుంచే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ఉంటుందని సినీ సర్కిల్స్‌ అంటున్నాయి. మరి ఇందులో హీరోయిన్‌, ఇతర వివరాలను మేకర్స్‌ ఇంకా ప్రకటించలేదు. అయితే ఆసక్తికరమైన విషయమేమంటే ఓ భాగంగా కాకుండా ఇప్పుడున్న ట్రెండ్‌ను ఫాలో అవుతూ చియాన్‌ 62 రెండు భాగాలుగా రూపొందనుంది. చిన్నా (తమిళంలో చిత్తా) దర్శకుడు అరుణ్‌ కుమార్‌ సినిమాను డైరెక్ట్‌ చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మరో వైపు విక్రమ్‌ అభిమానుల హ్యాపీనెస్‌ మామూలుగా లేదు. ఎందుకంటే ఇప్పటికే రెండు సినిమాలను రిలీజ్‌కు సిద్ధం చేస్తున్న చియాన్‌, వెంటనే తన 62వ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ ఇవ్వటం. అది కూడా పక్కా మాస్‌ కమర్షియల్‌ మూవీ కావటం. మరి ఈ సినిమాలో విక్రమ్‌ ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేయబోతున్నారో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.