English | Telugu

హీరోయిన్‌ కోసం రవితేజ తంటాలు!

ఎక్కువగా కమర్షియల్‌ మూవీస్‌ చేయటానికి ఇష్టపడే కథానాయకుడు మాస్‌ మహారాజ రవితేజ ఇప్పుడు తదుపరి సినిమాను గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేయటానికి రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ మూవీలో హీరోయిన్‌ ఎవరనే విషయంపై మేకర్స్‌ ఇంకా మల్లగుల్లాలు పడుతున్నట్లు సినీ సర్కిల్స్‌ సమాచారం. నిజానికి ప్రాజెక్ట్‌ ఫైనలైజ్‌ అయినప్పుడు వినిపించిన పేరు శ్రీలీల. అయితే ఆమె చేతినిండా అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉండటం వల్ల డేట్స్‌ను కేటాయించలేనని ముందుగానే ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. తర్వాత అవకాశం శాండిల్‌ వుడ్‌ బ్యూటీ రష్మిక మందన్న చేతికి వెళ్లింది.

క్రేజీ హీరోయిన్‌గా పాన్‌ ఇండియా రేంజ్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తున్న రష్మిక మందన్న సైతం డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేనని సింపుల్‌గా నో చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో మేకర్స్‌ ఇప్పుడు చెన్నై బ్యూటీ ప్రియాంక అరుల్‌ మోహన్‌ను రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఇప్పుడేమీ ఖాళీగా లేదు. పవన్‌ కళ్యాణ్‌తో ఓజీ సహా నాని - వివేక్‌ ఆత్రేయ సినిమా సరిపోదా శనివారంలో నటిస్తుంది. ఇప్పుడు రవితేజ మూవీ ఆఫర్‌ వెళ్లింది. మరి ఈ చెన్నై సొగసరి ఏమంటుందో చూడాలి. నిజ ఘటనలు ఆధారంగా గోపీచంద్‌ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మునుపెన్నడూ చూడనంత పవర్‌ఫుల్‌గా ఆయన పాత్ర ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని సినీ సర్కిల్స్‌ సమాచారం.

ఇంతకు ముందు రవితేజ, గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో డాన్‌ శీను, బలుపు, క్రాక్‌ చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పుడు నాలుగో సినిమా రూపొందనుంది. నవంబర్‌ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.