English | Telugu

గోపీచంద్ ' ఆక్సిజన్ ' మోషన్ పోస్టర్ రిలీజయ్యింది..!

హీరో గోపీచంద్ తాజా చిత్రం ఆక్సిజన్ మూవీ మోషన్ పోస్టర్ ను శృతిహాసన్ యూట్యూబ్ లో, ట్విట్టర్లో రిలీజ్ చేసింది. హైదరాబాద్ లో ఉన్న ఫ్యామస్ భవనాలు అగ్నికి ఆహుతి అవుతుంటే, టు లివ్ ఈజ్ యువర్ గోల్, టు రైజ్ ఈజ్ యువర్ బ్యాటిల్, లెట్స్ లివ్, లెట్స్ బ్రీత్ అని లైన్స్ వచ్చిన తర్వాత, గోపీచంద్ కారు మీద కూర్చుని ఉన్న షాట్, ఆ తర్వాత పోస్ట్రర్ ఎండ్ చేశాడు డైరెక్టర్ జ్యోతికృష్ణ. యువన్ శంకర్ రాజా ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ యావరేజ్ గా అనిపించినా, మోషన్ పోస్టర్ మాత్రం వైవిధ్యంగా ఉండేలా డిజైన్ చేశారు మూవీ టీం. శ్రీ సాయిరాం క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తుండగా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. గోపీచంద్ సరసన రాశీఖన్నా నటిస్తుండగా, జగపతిబాబు కీలక పాత్ర పోషించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.