English | Telugu

దీపికకు ఎంగేజ్ మెంట్ అయిపోయిందా..?

సోషల్ నెట్ వర్కింగ్ అనేది కత్తి లాంటిది. కూరగాయలు కోస్తుంది. కోయడం రాకపోతే వేలును కోస్తుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏదైనా ట్వీట్ చేసేప్పుడో, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేప్పుడో జాగ్రత్తగా ఉండకపోతే, సీన్ లు తిరగబడుతుంటాయి. లేటెస్ట్ గా విషయం బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలినికి తెలిసొచ్చింది. " దీపికా, నీ ఎంగేజ్ మెంట్ సందర్భంగా కంగ్రాట్యులేషన్స్. మీ ఇద్దరూ మంచి భవిష్యత్తుతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా " అని ఒక ట్వీట్ హేమమాలిని ఎకౌంట్ లో ప్రత్యక్షమైంది.

ఇది చూసిన బాలీవుడ్ జనాలందరూ, దీపికా పదుకుణేకు లవర్ రణ్ వీర్ సింగ్ తో ఎంగేజ్ మెంట్ అయిపోయింది అని చెవులు కొరుక్కోవడం మొదలెట్టేశారు. ఇది ఎంతలా స్ప్రెడ్ అయిందంటే, వెంటనే హేమ మళ్లీ " నేను విషెస్ చెప్పిన దీపిక నటి పదుకుణే కాదు. నా ట్విట్టర్ ఫాలోవర్ " అంటూ క్లారిటీతో ట్వీట్ చేయాల్సి వచ్చింది. ముందే ఆ దీపికను సర్ నేమ్ తో ట్వీట్ చేసి ఉంటే హేమమాలిని కు ఈ ఇబ్బంది ఉండకపోయేది. అందుకే అంటారు సోషల్ మీడియాను రెండు వైపులా పదునున్న కత్తి అని.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.