English | Telugu

సమంతకు బర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన మూవీ టీమ్స్..!

అందంతో పాటు అభినయంతో, మంచితనంతో అందర్నీ ఆకట్టుకున్న భామ సమంత. మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే సమంతకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. వాళ్లలో ఎక్కువమంది ఆమెను చాలా ఆప్యాయంగా చూసుకుంటుంటారు. తోటి కథానాయకులు కూడా సమంత అనగానే వెంటనే పాజిటివ్ గా స్పందిస్తారు. ఈరోజు సమంత పుట్టిన రోజు సందర్భంగా, ఆమె నటించిన సినిమాల టీంలు ఆమె కోసం ప్రత్యేకంగా బర్త్ డే పోస్టర్స్ రిలీజ్ చేయడం విశేషం. నితిన్ తో సమంత అ..ఆ లో నటిస్తుండగా, మహేష్ తో బ్రహ్మోత్సవం, సూర్య తో 24 సినిమాలు చేస్తోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించి సమంత బర్త్ డే స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాయి.

నితిన్ తన ట్విట్టర్లో వన్ ఆఫ్ ది క్లోజెస్ట్ యాక్ట్రెస్, వన్ ఆఫ్ ది నైసెస్ట్ పర్సన్ అంటూ ట్వీట్ చేసి, ఇద్దరూ కలిసి ఉన్న స్టిల్ రిలీజ్ చేస్తే, మహేష్ కూడా హ్యాపీ బర్త్ డే చెబుతూ ఇద్దరూ కలిసి డాన్స్ వేస్తున్న స్టిల్ ను రిలీజ్ చేశాడు. సూర్య టీం అయితే, ఏకంగా సమంతకు గిఫ్ట్ గా ఆమెపై 24 టీజర్ ను రిలీజ్ చేసింది.

ట్విట్టర్లో సమంత పేరు మధ్యాహ్నం అంతా ట్రెండ్ అవడం విశేషం. ఇండస్ట్రీలోని చాలామంది నటీనటులు సమంతకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మరిన్ని మంచి సినిమాలు తీయాలని, తన ఫౌండేషన్ ద్వారా మరిన్ని మంచిపనులు చేయాలని మనం కూడా కోరుకుందాం.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .