English | Telugu
'అత్తారింటికి దారేది' లో హరిప్రియ
Updated : Jul 29, 2014
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ రికార్డ్ మూవీ 'అత్తారింటికి దారేది' లో హరిప్రియ హీరోయిన్ గా నటి౦చనుంది. అదేంటి ఆల్రెడీ విడుదలైన సినిమాలో హీరోయిన్ ఏంటీ అనుకుంటున్నారా? అసలు విషయం ఏమిటంటే తెలుగులో వచ్చిన మన 'అత్తారింటికి దారేది' సినిమాను కన్నడలో రీమెక్ చేయబోతున్నారు. ఇందులో ప్రణీత చేసిన పాత్రకు హరిప్రియను ఎంపిక చేశారట. సమంత చేసిన పాత్రకు కన్నడ హీరోయిన్ రచిత రామ్ ను తీసుకున్నారు. ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరో కాదు తెలుగులో రాజమౌళి ఈగ సినిమాలో విలన్ గా చేసి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సుదీప్. ఇతను ప్రభాస్ చేసిన మిర్చి సినిమాను కన్నడలో రీమెక్ చేశాడు. అది సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు అతని కన్ను మన 'అత్తారింటికి దారేది' పై పడింది. అది అసలు విషయం.