English | Telugu
ఎప్పుడు చూడని విఎఫ్ఎక్స్ చూస్తారు
Updated : Jun 11, 2025
పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తన ఎంటైర్ కెరీర్ లో ఫస్ట్ టైం పీరియాడిక్ జోనర్ లో చేస్తున్న మూవీ 'హరిహర వీరమల్లు'(Hari Hara Veeramallu). పవన్ కెరీర్ లోనే హై బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య మూవీస్ పతాకంపై ఏ ఎం రత్నం, దయాకర్ నిర్మిస్తుండగా క్రిష్,(Krish)జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ మూవీ పాన్ ఇండియా వ్యాప్తంగా రేపు విడుదల కావాల్సి ఉంది. కానీ సాంకేతిక పనులలో జాప్యం వలన రిలీజ్ డేట్ ని చిత్రం బృందం వాయిదా వేసింది.
ఈ క్రమంలో రీసెంట్ గా 'వీరమల్లుకి 'విఎఫ్ఎక్స్' పనులని చేసిన 'అల్ జహ్రా'(Al Jahra)స్టూడియో సోషల్ మీడియా వేదికగా వీరమల్లు పై ట్వీట్ చేస్తు 'విజువల్ వండర్ గా వీరమల్లు ఉండనుంది. రెండున్నర ఏళ్ళు ఎంతో అంకిత భావంతో పని చేసాం. ప్రతి ఫ్రేమ్ లోను ప్రేక్షకుడు సినిమాటిక్ పొందుతాడు. దర్శకుడు ఎంతో అద్భుతంగా దీన్ని రూపొందించాడు. ఇంత వరకు ఎప్పుడు చూడని విఎఫ్ఎక్స్ ని చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉండండంటూ ట్వీట్ చేసింది. జ్యోతి కృష్ణ తో కలిసి దిగిన పిక్స్ ని కూడా షేర్ చేసింది.
ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వస్తుండటంతో పవన్ అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. దీంతో రిలీజ్ డేట్ పై త్వరలోనే ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. నిధి అగర్వాల్(Nidhhi Agerwal)హీరోయిన్ గా చేస్తున్న వీరమల్లులో బాబీ డియోల్ ఔరంగజేబుగా చేస్తున్నాడు. అనుపమ్ ఖేర్, సత్యరాజ్,అనసూయ, రఘుబాబు ఇతర పాత్రల్లో కనిపిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు కాగా ఇప్పటికే రిలీజైన పాటలు ప్రేక్షకాదరణ పొందాయి.