English | Telugu

గుణ‌శేఖ‌ర్ స్కెచ్ మార్చిండూ...

రుద్ర‌మ‌దేవిని విడుద‌ల చేయ‌డంలో ఉక్కిరిబిక్కిరి అయిన గుణ‌శేఖ‌ర్‌... ఆ సినిమా ఊహించిన‌ట్టుగానే `ఓ మాదిరిగా` మిగిలిపోవ‌డంతో భారీ న‌ష్టాల బాట ప‌ట్టాల్సివ‌చ్చింది. మెల్లిమెల్లిగా క‌నీసం 50 శాతం పెట్టుబ‌డిని తిరిగి ద‌క్కించుకోగ‌లిగాడు. రుద్ర‌మ‌దేవి త‌ర‌వాత‌.. సీక్వెల్‌గా ప్ర‌తాప‌రుద్రుడు తీస్తాన‌ని అప్ప‌ట్లోనే ప్ర‌క‌టించాడు గుణ‌. దానికి దిల్‌రాజు కూడా `సై` అన్నాడు. స్ర్కిప్టు రెడీ చేస్తే నిర్మించ‌డానికి నేను రెడీ అన్నాడు. అయితే ఇంత‌లోనే గుణ‌శేఖ‌ర్ స్కెచ్ మారింది.

ప్ర‌తాప‌రుద్రుడు క‌థ‌ని ప‌క్క‌న పెట్టి మ‌రో స్టోరీ రెడీ చేశాడ‌ట‌. అదు... వీరాభిమ‌న్యు. ఈ టైటిల్‌ని గుణ ఫిల్మ్‌ఛాంబ‌ర్‌లో కూడా రిజిస్ట‌ర్ చేయించేశాడు. దాంతో.. ప్ర‌తాప‌రుద్రుడ్ని తాత్కాలికంగా ప‌క్క‌న పెట్టిన‌ట్టు అయ్యింది. వీరాభిమ‌న్యు కూడా... భారీ బ‌డ్జెట్ చిత్ర‌మే. అయితే అందులో క‌మ‌ర్‌షియ‌ల్ అంశాలెక్కువ‌ట‌. అందుకే వీరాభిమ‌న్యువైపు గుణ‌శేఖ‌ర్ మొగ్గు చూపించాడ‌ని తెలుస్తోంది.

మ‌రి ఈ సినిమాలో హీరోగా న‌టించేదెవ‌రు? గుణ‌నే ఈ సినిమాని నిర్మిస్తాడా? లేదంటే దిల్‌రాజు ఆ బాధ్య‌త తీసుకొంటాడా అన్న‌ది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.