English | Telugu
బెంగాల్ టైగర్ కి రిపేర్లు..!!
Updated : Oct 31, 2015
మాస్ మహరాజా రవితేజ నటించిన బెంగాల్ టైగర్ దీపావళి రేస్ నుంచి తప్పుకుంది. నవంబర్ 5 థియేటర్లలో సందడి చేయాల్సిన సినిమా సడన్ గా వాయిదా పడింది. ఒకేసారి మూడు వారాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా అవుట్ పుట్ రవితేజ అంచనాలను అందుకోలేకపోవడమే అసలు కారణం అని సమాచారం. అందుకని ఈ సినిమాలో కొన్ని సీన్లను రిపేర్లు చేయమని సూచించాడట. అందుకని ఒక ముఖ్యమైన సన్నివేశంలో రవితేజకు సంబంధించిన షాట్స్‌ను రీ షూట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట. దాని కోసం వారం రోజులు చిత్ర యూనిట్ ఓ చిన్న షెడ్యూల్ ప్లాన్ చేయబోతున్నారట. అదీ అసలు సంగతి. మొత్తానికి బెంగాల్ టైగర్ ఈ నెలలో రిలీజయ్యే అవకాశాలు తక్కువేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.