English | Telugu
' గులాబీ ' సినిమా సంగీత దర్శకుడిపై దాడి..!
Updated : Apr 1, 2016
గులాబీ సినిమా సంగీత దర్శకుడు శశి ప్రీతమ్ పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. పాతకక్ష్యలే దీనికి కారణమని తెలుస్తోంది. ఒక కేసు విషయంలో ఆర్డర్ తనకు అనుకూలంగా వచ్చిందన్న అక్కసుతో ప్రత్యర్ధి దాడి చేశాడని శశిప్రతీమ్ చెబుతున్నారు. తాను ఆఫీస్ కు వెళ్తుంటే వెనక వైపుగా దాడి చేసి బూతులు తిడుతూ కొట్టాడని ఆయన పేర్కొన్నారు. జనం వచ్చి అడ్డుకునే సరికి దుండగుడు ఆయన్ను వదిలేసి పరారయ్యాడు. ఈ దాడిపై శశి ప్రీతమ్ మాదాపూర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేసి నిందితులపై యాక్షన్ తీసుకుంటామని చెబుతున్నారు. కాగా కంటి కింద తగిలిన గాయానికి శశిప్రీతమ్ చికిత్స తీసుకుంటున్నారు. గత కొద్ది కాలంగా బిజినెస్ వ్యవహారాల కారణంగా శశికి ప్రత్యర్ధులతో గొడవలు అవుతున్నాయని సమాచారం.