English | Telugu

‘గోవిందుడు అందరివాడేలే’ ట్రైలర్ టాక్

తెలుగుదనాన్ని వెండితెరపై చూపించడంలో కృష్ణవంశీ కింగ్ ఎందుకంటారో తెలుసా? ఒకసారి ‘గోవిందుడు అందరివాడేలే’ ట్రైలర్ చూడండి. గత కొంతకాలంగా బాక్స్ ఆఫీస్ వద్ద కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కృష్ణవంశీ, ఈసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజతో కలిసి తన ట్రేడ్ మార్క్ సబ్జెక్టుతో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు.


ఇప్పుడు ఈ ‘గోవిందుడు అందరివాడేలే’ ట్రైలర్ పై ఇండస్ట్రీ పెద్దలు ప్రశంసలు కురిపిస్తున్నారు. లేటెస్ట్గ గా రాజమౌళి కూడా ఈ ట్రైలర్ పై ట్విట్టర్ లో స్పందించారు.'ఈ ట్రైలర్ చూస్తుంటే.. కృష్ణ వంశి గారు మళ్లీ తన మార్క్ ఎలిమెంట్స్ ముందుకు వచ్చినట్లు అనిపిస్తోంది. గోవిందుడి ట్రైలర్ హృదయాన్ని హత్తుకుంది. చరణ్ కు పోనీ టెయిల్ హెయిర్ స్టైల్ భలే బాగుందటూ'' చెప్పుకొచ్చారు రాజమౌళి.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.