English | Telugu
చిరుని ఇబ్బంది పెట్టిన మెగా ఫ్యాన్స్
Updated : Sep 16, 2014
రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ శిల్పకళావేదికలో మెగా అభిమానుల మధ్య గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ లో మెగాస్టార్ మాట్లాడుతున్నప్పుడు పవన్ గురించి అభిమానులు నినాదాలు చేసి ఆయనను కొంత అసహనానికి గురిచేశారు. ఆయన ప్రసంగానికి పదే పదే అడ్డుతగలడంతో చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడక తప్పలేదు. మీ ..మా పవన్ కళ్యాణ్ గోవిందుడు అందరివాడేలే సినిమా విడుదలయిన తరువాత ఆ సినిమా 15౦ రోజుల ఉత్సవానికి వస్తే అభ్యంతరమా ? అని చిరంజీవి అభిమానులను ప్రశ్నించారు. గత కొన్ని సంవత్సరాలుగా చరణ్ సినిమా ఫంక్షన్లలో పవన్‌కళ్యాణ్ గురించిన ప్రశ్నలు అభిమానుల నుంచి దూసుకొస్తున్నాయి. ప్రతిసారీ ఈ ప్రశ్నలతో చిరంజీవి ఇబ్బంది పడాల్సి వస్తోంది.